యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నది. మొదటి పార్ట్ ఈ ఏడాది డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.. ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో పాటు అన్ని భాషలలో కలుపుకొని దాదాపుగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ ని రాబట్టింది.


ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే సలార్ సినిమా సెన్సార్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం A సర్టిఫికెట్ను సైతం ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాలతో పాటు వైలెన్స్ కాస్త ఎక్కువగా ఉండడంతో ఇలాంటి సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే..2:55:22 సెకండ్లు ఉన్నట్లుగా తెలుస్తున్నది ఇదే సమయంలో ఈ సినిమా మొదలైన అరగంట వరకు ప్రభాస్ ఎంట్రీ ఉండదనే టాక్ కూడా బయట వినిపిస్తోంది.


ఇదంతా ఇలా ఉండగా చిత్ర బృందం రెండో ట్రైలర్ ని కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ట్రైలర్తో ప్రభాస్ కి హైప్ పెరిగేలా చేస్తుందేమో చూడాలి.. ఈనెల 16 లేదా 18వ తేదీ విడుదల చేసేందుకు రెండో ట్రైలర్ ని చిత్ర బృందం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.. సలార్ సినిమాలోని కీలకమైన పాత్రల పృథ్విరాజ్ సుకుమారంతో పాటు జగపతిబాబు శ్రియ రెడ్డి నటిస్తూ ఉన్నారు.. హీరోయిన్గా శృతిహాసన్ కూడా నటిస్తోంది. ఈ సినిమా కేజిఎఫ్ సినిమాకి లింకు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: