ప్రస్తుతం యానిమల్ సక్సెస్ తో డైరెక్టర్ సందీప్ పేరు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ముఖ్యంగా యాక్షన్ లవర్స్ ని ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'యానిమల్' మూవీకి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మూవీ చివర్లో రివీల్ చేశాడు డైరెక్టర్ సందీప్ వంగ. అంతేకాదు 'యానిమల్ పార్క్' అనే టైటిల్ తో ఈ సీక్వెల్ రాబోతుందని, సీక్వెల్ కు సంబంధించి కొన్ని పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా చూపించాడు. అది చూసిన ఆడియన్స్ కి యానిమల్ ని మించి నెక్స్ట్ లెవెల్ లో సీక్వెల్ ఉండబోతుందని అర్థమయిపోయింది. 

దీంతో యానిమల్ సీక్వెల్ ఫై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. తాజాగా యానిమల్ సీక్వెల్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సందీప్ వంగా. ప్రభాస్, అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసిన తర్వాత 2026 లో యానిమల్ పార్క్ ని తెరకెక్కించనున్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సీక్వెల్ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చాడు." యానిమల్ పార్క్ లో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయి. గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్ పంచడమే యానిమల్ పార్క్ లక్ష్యం. ఇందులో ఎవరూ ఊహించని యాక్షన్ సీన్స్ ఉంటాయి. 

రణబీర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా. దీంతో సందీప్ చేసిన కామెంట్స్ యానిమల్ సీక్వెల్ పై అంచనాలను ఒక్కసారిగా పెంచేసాయి. మొత్తం మీద యానిమల్ పార్క్ కోసం 2026 వరకు ఆగాల్సిందే. ఇక 'యానిమల్' విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లోనే ఈ సినిమా రూ.500 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.527 కోట్ల 60 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి రూ.1000 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. కేవలం హిందీలోనే రూ.300 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది. ఇక తెలుగులోనూ ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ అదరగొడుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: