కేజిఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. దీంతో తన తదుపరి ప్రాజెక్టు విషయంలో యశ్ ఎన్నో జాగ్రత్తలు వహిస్తూ ఆచితూచి అడుగులు వేశాడు. అందుకే కేజిఎఫ్ తర్వాత కొత్త సినిమాని అనౌన్స్ చేయడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పట్టింది. యశ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. యశ్ ఎలాంటి సినిమాను ప్రకటిస్తారని ఇన్ని రోజుల సైలెన్స్ కి బ్రేక్ వేస్తూ ఎట్టకేలకు తన కొత్త సినిమాను ప్రకటించాడు. యశ్ కెరియర్ లో 19వ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రానికి 'టాక్సిక్ - ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్' అనే వెరైటీ టైటిల్ ని ఫిక్స్ చేశారు. 

దర్శకురాలిగా తీసిన రెండు సినిమాలతోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న గీత మోహన్ దాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ టీం టైటిల్ తో పాటు గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేయగా ఈ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఈ మూవీని 2025 ఏప్రిల్ 10 విడుదల చేస్తున్నట్లు ఇదే గ్లిమ్స్ వీడియోలో తెలిపారు మేకర్స్. ఇదిలా ఉంటే ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ ని వదిలిపెట్టి యశ్ తన కొత్త సినిమాని గీతూ మోహన్ దాస్ తో చేయడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ గీత మోహన్ దాస్ గురించిన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు నెటిజన్స్. 

ఈమె ఒక మలయాళ నటి, దర్శకురాలు. కొచ్చిలో పుట్టిన గీత మోహన్ దాస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఐదేళ్ల వయసులోనే 'ఒన్ను మూతాల్ పూజయమ్ వరే' అనే సినిమాతో ఆరంగేట్రం చేసింది. 1986 లో వచ్చిన ఈ సినిమాతో ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర పురస్కారాన్ని అందుకుంది. అదే ఏడాది మమ్ముట్టి హీరోగా వచ్చిన మూడు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో హీరోయిన్ గా మారింది. అలా హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. 2004 లో వచ్చిన 'అకలే' సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా కేరళ స్టేట్ అవార్డు అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: