ఇక ఈ ఫొటోల్లో రామ్ చరణ్, ఉపాసన మాత్రమే కనిపించారు. మెగా ప్రిన్సెస్ క్లింకార ను వెంట తీసుకురాలేదని తెలుస్తోంది. సీఎంను కలిసి సందర్బంగా శ్రీకాంత్ షిండే భార్య వృశాలి వారికి సాంప్రదాయ తిలకం దిద్దింది. అలాగే దంపతులకు హారతితో స్వాగతం పలికారు. ఇక రామ్ డెనిమ్ బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు. మెగా కోడలు ఉపాసన పూల కుర్తాలో సింపుల్ గా మెరిశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
రామ్ చరణ్ మూవీ అప్డేట్స్ విషయానికొస్తే... దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRRతో అలరించారు. ఈ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. నెక్ట్స్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ Game Changer రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రావాల్సిన ఈ చిత్రం ఆలస్యమవుతోంది. వచ్చే ఏడాది ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి