సంక్రాంతి రేస్ లో టాప్ హీరోల సినిమాలకు దక్కని సక్సస్ ఒక చిన్న హీరో సినిమాకు దక్కడం అంత సులువైన పని కాదు. ఇప్పుడు అలాంటి అదృష్టం యంగ్ తేజ్ సజ్జా కు దక్కింది. రెండు దశాబ్ధాల క్రితం మహేష్ కు కొడుకుగా నటించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు ఏకంగా మహేష్ ‘గుంటూరు కారం’ మూవీని డామినేట్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.సాధారణంగా ఇలాంటి భారీ హిట్స్ చిన్న హీరోలకు చాల అరుదుగా దక్కుతూ ఉంటాయి. చాల సంవత్సరాల క్రితం అప్పటి చాక్లెట్ బాయ్ గా అమ్మాయిలలో విపరీతంగా పేరు తెచ్చుకున్న ‘నువ్వేకావాలి’ మూవీతో తరుణ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. అయితే ఆతరువాత వచ్చిన చాల సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తరుణ్ రేస్ లోంచి తప్పుకోవలసి వచ్చింది.అదేవిధంగా ఒకనాటి యంగ్ హీరోగా విపరీతమైన పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ ‘కొత్తబంగారులోకం’ సినిమాతో ఓవర్ నైట్ హీరోగా మారిపోయాడు. అయితే ఆతరువాత అతడి సినిమాలు అన్నీ ఫ్లాప్ అవవడంతో చివరకు ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆతరువాత ఇండస్ట్రీలోకి వచ్చిన రాజ్ తరుణ్ పరిస్థితి కూడ ఇలాగే మారింది. ఇక లేటెస్ట్ గా ‘ఉప్పెన’ మూవీతో క్రేజీ హీరోగా మారిపోయిన వైష్ణవ్ తేజ్ ఎన్ని సినిమాలలో నటిస్తున్నా హిట్ అన్న పదం వినలేకపోతున్నాడు.ఇలా వీరంతా ఇబ్బందులు పడటానికి తమ సినిమాల ఎంపికలో చేసిన పోరపాట్లు మాత్రమే అన్న కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో చాలమంది దర్శక నిర్మాతల దృష్టిలో తేజ్ సజ్జా ఉన్నాడు అని తెలుస్తోంది. సినిమా కథ విషయం తరువాత ఆలోచిద్దాం అంటూ అతడి చుట్టూ అడ్వాన్స్ కింద చెక్కులు ఇవ్వడానికి చాలమంది నిర్మాతలు క్యూ కడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో తేజ్ సజ్జా తన సినిమా కథల ఎంపికలో జాగ్రత్త వహించాలి అంటూ కొందరు అతడికి సూచనలు ఇస్తున్నారు..    మరింత సమాచారం తెలుసుకోండి: