క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ అభిమానులకు ఓ శుభవార్త అందించారు. ఈ జంట వారి రెండవ బిడ్డకు వెల్ కం చెప్పారు.సోషల్ మీడియాలో ఈ శుభవార్తను స్వయంగా ప్రకటించడంతో కొన్నాళ్లుగా వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. ఈ వార్త తెలియగానే వీరిద్దరికీ సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ రెండవ సారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ బాలీవుడ్ నటి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన కుమారుడి పేరును కూడా పోస్ట్‌లో వెల్లడించింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. అనుష్క రెండోసారి గర్భం దాల్చిందని వినిపించాయి. అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ధృవీకరించలేదు. కొంతకాలం క్రితం, దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరి రహస్యాన్ని వెల్లడించాడు. ప్రెగ్నెన్సీ పుకార్లలో నిజంగా నిజం ఉందని అప్పుడు నమ్మారు. అయితే, ఆ తర్వాత ఏబీడీ ఈ వార్త నిజం కాదంటూ ప్రకటించాడు. దీంతో అందరిలో అయోమయం నెలకొంది.ఇంగ్లండ్ జట్టుతో జరుగుతోన్న 5 టెస్టుల సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ కారణాల వల్ల సిరీస్ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కానీ, సరైన రీజన్ మాత్రం వెల్లడించలేదు. ఈ క్రమంలో ఎన్నో పుకార్లు వినిపించాయి. అటు బీసీసీఐ మాత్రం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని అభిమానులకు కోరింది. మొత్తానికి కోహ్లీ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న రీజన్ ఇప్పటికి జనాలకు తెలిసింది.
అనుష్క శర్మ పోస్ట్‌లో - 'ఆనందం, ప్రేమతో మా హృదయాలు నిండాయి. ఫిబ్రవరి 15 న, మేం మా అబ్బాయి అకాయ్, వామికా చిన్న సోదరుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. మీ అందరికీ చెప్పడానికి మేం సంతోషిస్తున్నాం! మా జీవితంలోని ఈ అందమైన దశలో మీ ప్రార్థనలు, శుభాకాంక్షలను మేం కోరుకుంటున్నాం. దయచేసి ఈ సమయంలో మా గోప్యతను గౌరవించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం' అంటూ రాసుకొచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: