యూట్యూబ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నటువంటి వారిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఒకరు.. ఆ తర్వాత బిగ్ బాస్ -5 సీజన్లో రన్నర్ గా నిలిచారు.. ఇటీవల ఆయన సోదరుడిని పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. డ్రక్స్ కేసులో షణ్ముఖ్ అమ్మాయిని మోసం చేసిన కేసులో కూడా ఆయన సోదరుడు సంపత్ నీ సైతం హైదరాబాద్ పోలీసులు సైతం అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ మౌనిక అనే యువతీని సైతం మోసం చేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారట షణ్ముఖ సోదరుడు సంపత్..


ఆరు రోజుల్లో తనతో పెళ్లి అనగా మరో యువతినీ మోసం చేయడంతో మౌనిక వెంటనే దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని ప్రశ్నించేందుకు ఫ్లాట్కు వెళ్ళగా అక్కడ షణ్ము కఖ్ గంజాయి తీసుకుంటున్నట్టుగా దొరికే పోయారు.. మౌనిక వీడియో తీస్తుండగా డ్రగ్స్ మత్తులో ఉన్న షణ్ముఖ వీడియో తీయొద్దు అంటూ వాదన చేసినట్టుగా సమాచారం. షణ్ముఖ్ సంపత్ లను పోలీసుల సైతం అరెస్టు చేశారు.. షణ్ముఖ అరెస్ట్ కావడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా హిట్ అండ్ రన్ కేసులో కూడా అరెస్ట్ అయ్యారు.


అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుంచి బయటపడ్డారు..యూట్యూబ్ వీడియోలతో సెలబ్రిటీగా మారిన షణ్ముఖ్.. సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వెబ్ సిరీస్ తో బాగానే గుర్తింపు సంపాదించుకున్నారు.. ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ సిరి హనుమంతు తో బిగ్ బాస్ లో ఓవర్ చేయడంతో అతనిని పక్కనపెట్టి సన్నీ విన్నర్ గా గెలిచారు.. సిరి తో చేసిన సిల్లీ పనుల వల్ల అతని ప్రేమ కూడా బెడ్సి కొట్టింది.. దీప్తి సునయన అతని ప్రేమకు కూడా బ్రేకప్ చెప్పేసింది బయటికి వచ్చాక.. ఏజెంట్ సాయి సంతోష్ అనే వెబ్ సిరీస్ లో చేయగా పర్వాలేదు అనిపించుకున్నారు. ఇటీవలే వైవాహర్ష నటించిన సుందరం మాస్టర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కనిపించారు. ప్రస్తుతం షణ్ముఖ్ అతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: