నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ నాడులో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో గుర్తింపు తెచ్చుకుంది నయనతార. తెలుగులో ఎవ్వరు పట్టించుకోకపోయినా అక్కడ మాత్రం ఆమెని లేడీ సూపర్ స్టార్ అంటూ ఉంటారు.తాజాగా ఆమెకు మరో అవార్డు చేరింది. 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2024' అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం నాడు రాత్రి ముంబైలో గ్రాండ్‌గా జరిగింది.'జవాన్‌' మూవీలో ఆమె నటనకు గాను నయనతార ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది.ఇక పలువురు బాలీవుడ్‌ సినీ సెలబ్రిటీస్‌ పాల్గొన్న ఈ ఈవెంట్‌కు గ్రీన్‌ కలర్ చీరలో హాజరైన నయనతార.. సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.అయితే ఈమెకు అవార్డ్ రావడం పట్ల బాలీవుడ్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. 


అసలు ఈమె సినిమా చేసిన తరువాత ఆ సినిమా గురించి అస్సలు పట్టించుకోదు. కనీసం ఆ సినిమా ఈవెంట్లలో కూడా పాల్గొనదు. జవాన్ విషయంలో కూడా ప్రమోషన్స్ కి దూరంగా ఉంది. అలాంటి ఈవిడకి అవార్డ్ రావడం ఏంటని బాలీవుడ్ ప్రేక్షకులు మండిపడుతున్నారు.ఇక 'జవాన్‌' మూవీకి ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్‌ అవార్డును అందుకోగా, 'యానిమల్‌' మూవీతో మరో భారీ విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగా బెస్ట్‌ డైరెక్టర్‌గా అవార్డును అందుకున్నాడు. బెస్ట్ నెగిటివ్‌ రోల్‌కు 'యానిమల్‌'లో నటించిన బాబీ డియోల్‌ ఇంకా క్రిటిక్స్ ఉత్తమ నటుడు అవార్డును విక్కీ కౌశల్‌ (సామ్‌ బహదూర్‌), క్రిటిక్స్‌ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్‌) ఇంకా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్‌ అవార్డులు గెలుచుకున్నారు. ఇంకా సినిమాలతో పాటు టీవీ, వెబ్‌ సిరీస్‌లకు కూడా అవార్డులను అందజేశారు. రాణి ముఖర్జీ, షాహిద్ కపూర్, నీల్ భట్, విక్రాంత్ మాస్సే ఇంకా ఐశ్వర్య శర్మ తదితరులు పాల్గొన్నారు.సినిమాని పట్టించుకోని ఈవిడకి అవార్డ్ ఇవ్వడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: