సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ అటు హీరోయిన్ల విషయంలో మాత్రం దర్శక నిర్మాతలు ఎక్కువగా బయట వాళ్ళని నమ్ముకుంటూ ఉంటారు. ఇక తెలుగు హీరోయిన్లు తెరమీదకి వచ్చిన కూడా ఎందుకో వారిని తమ సినిమాల్లో పెట్టుకునేందుకు  ఆసక్తి చూపించరు అనే ఒక విమర్శ కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా నార్త్ నుంచి ఎంతోమంది అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ హీరోయిన్గా అవకాశాలు ఇస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారు అందరూ కూడా దాదాపు ఇలా నార్త్ నుంచి వచ్చిన వాళ్లే.




 అయితే ఇలాంటి వారిలో  కాజల్ అగర్వాల్ కూడా ఒకరు అని చెప్పాలి. కృష్ణవంశీ దర్శకత్వంలో నవదీప్, శివ బాలాజీ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చందమామ  సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది కాజల్ అగర్వాల్. ఇక ఈ మూవీ సూపర్ డూపర్ విజయం సాధించడంతో ఈ సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఇక తన నటనతో ప్రేక్షకులు అందరినీ కూడా ఫిదా చేసేసింది అని చెప్పాలి. చందమామ సినిమా తర్వాత ఏకంగా మగధీరా లాంటి భారీ బడ్జెట్ సినిమాలో నటించే ఛాన్స్ ను దక్కించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత కాజల్ ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు అని చెప్పాలి.


 సాధారణంగా నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్లకు పెద్దగా తెలుగు రాదు. అందుకే హీరోయిన్లకు మరొకరు డబ్బింగ్ చెప్పడం చూస్తూ ఉంటాం. కాజల్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక మొదటి సినిమా నుంచి కాజల్ కు డబ్బింగ్  అవసరం ఏర్పడింది. అయితే చందమామ సినిమా కోసం రెగ్యులర్గా తనకు డబ్బింగ్ చెప్పే వాళ్ళను కాకుండా కాజల్ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఏకంగా హీరోయిన్ ఛార్మిని ఒప్పించాడట డైరెక్టర్ కృష్ణ వంశీ. ఇక ఆమెతోనే కాజల్ పాత్రకి డబ్బింగ్ చేపించాడట. అయితే ఇక చార్మి వాయిస్ తో కాజల్ పాత్ర ఎలివేట్ అవ్వడమే కాదు.. ఆ పాత్రకు చార్మి వాయిస్ సరిగ్గా సరిపోయింది. ఇక ఒక రకంగా కాజల్ పాత్ర సక్సెస్ అవ్వడానికి చార్మినే మొదటి కారణం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: