తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ మరి కొంత కాలం లో అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం మే లేదా జూన్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా చాలా తక్కువ సమయం ఉండడం తో ప్రస్తుతం అనిల్ రావిపూడిసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ దర్శకుడు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఓకే చేసినట్లు తెలుస్తోంది . అనిల్ రావిపూడి , వెంకీ మూవీ కోసం బీమ్స్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నట్లు  ఆ విషయమై అనిల్ రావిపూడి , బిమ్స్ ను సంప్రదించగా ఆయన కూడా వెంకీ సినిమాకి సంగీతం అందించడానికి ఫుల్ పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇది వరకే వెంకటేష్ ... అనిల్ రావిపూడి కాంబో లో ఎఫ్ 2 ... ఎఫ్ 3 అనే రెండు కామెడీ ఓరియంటెడ్ మూవీ లు రూపొందాయి.

ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అలా ఇప్పటికే విరి కాంబో లో రూపొందిన రెండు మూవీ లు మంచి విజయం సాధించడంతో వీరి కలయికలు వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: