శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ , తమన్నా భాటియా , రాహుల్ హరిదాస్ , నిఖిల్ సిద్ధార్థ్ , వంశీ కృష్ణ , సోనియా దీప్తి , గాయత్రీ రావు , మోనాలీ చౌదరి ప్రధాన పాత్రలలో మిక్కి మేజర్ సంగీత సారధ్యంలో 2007 వ సంవత్సరంలో హ్యాపీ డేస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో పెద్దగా అంచనాలు లేకుండా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. 

దానితో ఈ మూవీ కి రోజు రోజుకు కలెక్షన్ లు పెరుగుతూ వచ్చాయి. చివరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో నటించిన నటీనటులందరికీ అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల కు ఈ మూవీ కి సంగీతం అందించిన మిక్కీ మేయర్ కు ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు దక్కింది. ఇలా ఆ సమయం లో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమాను మళ్ళీ తిరిగి థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ ని ఏప్రిల్ 12 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా యొక్క రీ రిలీజ్ ఏపీ మరియు తెలంగాణ థియేటర్ హక్కులను గ్లోబల్ సినిమా సంస్థ దక్కించుకున్నట్లు కూడా ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి రీ రిలీజ్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి కలెక్షన్ లను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: