కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్ లోనూ మెరిసిన నటుడు సిద్ధార్థ్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. చాలా రోజులుగా నటి అదితి రావ్ హైదరీతో అతడు రిలేషన్షిప్ లో ఉన్న విషయం తెలిసిందే.అయితే వీళ్లిద్దరూ బుధవారం (మార్చి 27) వనపర్తి జిల్లాలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో కొంతమంది సమక్షంలోనే సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం గమనార్హం.నటుడు సిద్ధార్థ్, నటి అదితి రావ్ రెండేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లు ఎప్పుడూ తమ బంధాన్ని నేరుగా బయటపెట్టకపోయినా.. చాలాసార్లు పబ్లిగ్గా జంటగా కనిపించి ఆ విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు.తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపైర్ శ్రీరంగనాథ స్వామి ఆలయంలో వీళ్లు పెళ్లితో ఒక్కటవడం విశేషం. అయితే ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడం కొత్త కాకపోయినా.. కనీసం పెళ్లి తర్వాత అయినా వీళ్లు ఒక్క ఫొటోను కూడా బయటపెట్టలేదు. ఆన్‌లైన్లోనూ ఫొటోలు లీకవకుండా చూసుకున్నారు. బుధవారం (మార్చి 27) ఉదయమే శ్రీరంగనాథ ఆలయంలో పెళ్లి జరిగింది.ఈ వార్త సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో వచ్చిన మహా సముద్రం మూవీలో సిద్ధార్థ్, అదితి కలిసి నటించారు. అప్పటి నుంచీ ఈ ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీళ్లు ప్రతిసారి జంటగా కనిపించి ఆ రూమర్లను నిజం చేశారు. చివరికి అధికారికంగా తమ బంధం గురించి బయటపెట్టకుండా నేరుగా పెళ్లితో ఒక్కటైపోయారు.సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ తరచూ రీల్స్ చేస్తూ కూడా అభిమానులతో టచ్ లో ఉన్నారు. ప్రస్తుతం అదితి రావ్ హైదరీ నెట్‌ఫ్లిక్స్ లో రాబోతున్న వెబ్ సిరీస్ హీరామండిలో నటిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దీనిని డైరెక్ట్ చేస్తున్నాడు. గాంధీ టాక్స్, ఇంగ్లిష్ మూవీ లయనెస్ లాంటి వాటిలోనూ ఆమె నటిస్తోంది.

మరోవైపు సిద్ధార్థ్ గతేడాది చిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సిద్ధార్థ్ ఇండియన్ 2 మూవీలోనూ నటించాడు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరీ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా తమిళనాడుకు చెందిన పురోహితులు ఈ వివాహ వేడుకలను నిర్వహించినట్లు టాక్ వినిపిస్తోంది.ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగిందని తెలుస్తోంది. అయితే వీరి పెళ్లికి సంబంధించిన వార్తలపై సిద్ధార్థ్ కానీ, అదితి రావు హైదరి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. ఇకపోతే సిద్ధార్థ్, అదితి రావు హైదరి గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. 'మహా సముద్రం' సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ చిగురించింది.

ఇక అప్పట్నుంచి ఈ లవ్ కపుల్ పలు ఈవెంట్స్, ఫంక్షన్స్, రెస్టారెంట్లలో కనిపించారు. ఇదిలా ఉంటే.. సిద్ధార్థ్‌కు ఇది రెండో వివాహం.. కాగా అదితి రావుకి కూడా ఇది రెండో పెళ్లి. సిద్ధార్థ్ 2003లో మేఘన అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు.కానీ అనివార్య కారణాల వల్ల విభేదాలు ఏర్పడి ఇద్దరూ 2007లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే అతడి బాగుబాగోగులు మొత్తం సిద్ధార్థే చూసుకుంటున్నాడు. అలాగే అదితికి కూడా ఇది రెండో మ్యారేజ్. గతంలో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరి మధ్య కూడా విభేధాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు.కాగా.. సిద్దార్థ్, అదితిరావు హైదరి.. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. 2003లో మేఘన ను సిద్ధార్థ్‌ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అనంతరం ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో.. విడిపోయారు. ఆ తర్వాత సిద్ధార్థ్‌ విషయంలో మళ్లీ పెళ్లి అంటూ ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరకు అదితిరావు హైదరిని ఇలా రహస్యంగా వివాహం చేసుకుని.. మళ్లీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అదితి రావు కూడా 2002లో లాయర్, యాక్టర్ అయిన సత్యదీప్ మిశ్రా ను వివాహం చేసుకుని.. ఆ తర్వాత విడాకులు తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: