అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు వెయిట్ చేస్తున్న చిత్రం పుష్ప-2 ది రూల్. పుష్ప-1 ఓ రేంజ్ లో ఆకట్టుకోవడం వల్ల సెకండ్ పార్ట్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.డైరెక్టర్ సుకుమార్ కూడా పుష్ప-2 మూవీని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా విడుదలైన పుష్ప-2 టీజర్ అంచనాలు  పెంచేసింది.ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అయితే టీజర్ లో మొత్తం జాతర సీన్లు చూపించారు మేకర్స్. జాతర సీన్లు, యాక్షన్, హీరో కాస్ట్యూమ్ తో టీజర్ దద్దరిల్లిపోయింది. బన్నీ లుక్ చూసి అభిమానులు బాగా ఖుషీ అయ్యారు.ఇక ఈ టీజర్ తో సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. కానీ ఒక్క డైలాగ్ యాడ్ చేస్తే ఇంకా బాగుండేది అని అభిప్రాయపడ్డారు.పుష్ప-2 టీజర్.. యూట్యూబ్ లో బాగా దుమ్ముదులిపేస్తోంది.


అతి తక్కువ టైమ్ లోనే మిలియన్ వ్యూవ్స్ రాబట్టిన ఈ  టీజర్.. తాజాగా మరో రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్ లో నెం.1 ట్రెండింగ్ స్థానంలో కొనసాగి ఈ టీజర్ రికార్డు సృష్టించింది. 2017 వ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ మూవీ రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టింది. ఆ మూవీ టీజర్..ఏకంగా 137 గంటలకు పైగా యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.ఇక ఆ తర్వాత ఏడేళ్లలో ఎన్నో సినిమాలు వచ్చినా కానీ జై లవకుశ రికార్డును బద్దలు కొట్టలేకపోయాయి. ఇప్పుడు ఆ రికార్డును పుష్ప-2 సినిమా టీజర్ బ్రేక్ చేసింది. 110 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్లకు పైగా లైక్స్‌ తో జెట్ స్పీడ్ లో ఇంకా దూసుకుపోతోంది. రిలీజ్‌ కు ముందే పుష్ప-2 ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తే.. ఇక విడుదల తర్వాత మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని పలువురు సినీ పండితులు చెబుతున్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: