కొన్ని రోజుల క్రితమే తెలుగులో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేయలేక పోయినప్పటికీ విమర్శకుల నుండి మంచి ప్రశంశలు పొందిన సినిమాగా నిలిచింది రజాకార్. ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో జరిగిన కొన్ని పోరాటాలను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించారు. ఇకపోతే ఇందులోని కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి అని ... ఆ సన్నివేశాలకు కంటినిండా నీళ్లు తిరిగాయి అని అనేక మంది జనాలు కూడా చెప్పుకొచ్చారు. 

అలా కొంత మంది ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్న ఈ సినిమాని మరికొన్ని రోజుల్లోనే హిందీ తో పాటు మరికొన్ని భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుడింది. ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాని హిందీ , మరాఠీ సహా మన దక్షిణాది భాషల్లో కూడా ఈ ఏప్రిల్ 26 న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. 

ఇక ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్ వారు నేషనల్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మరి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణం వహించారు. బాబీ సింహా , వేదిక , అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. మరి ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సినిమా ఇతర భాష ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే ఏప్రిల్ 26 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే . ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించిన బాబీ సింహా , వేదిక , అనసూయ భరద్వాజ్ నటనలకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: