టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరుశురాం పేట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఇది వరకే విజయ్ , పరుశురామ్ కాంబోలో రూపొందిన గీత గోవిందం మూవీ మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబోలో రెండవ సినిమా కావడంతో మొదటి నుండి ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

అలా మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 5 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ పెద్ద స్థాయిలో కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయలేక పోయింది. దానితో చివరగా ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరియర్ లో ఫ్లాప్ మూవీ గా మిగిలిపోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

తాజాగా అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఏప్రిల్ 26 వ తేదీ నుండి తెలుగు , తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ సంస్థ వారు తాజాగా ప్రకటించారు. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd