ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఫిజిక్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఊహించని విధంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి దూరమయింది. ఇక ఇలియానాకి ఇటీవల బిడ్డ పుట్టిన సంగతి కూడా తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం కోసం సినిమాలకి బ్రేక్ ఇచ్చిన ఇలియానా గత సంవత్సరం నుండి మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తన ప్రియుడికి సంబంధించిన విషయాలను అన్నిటిని కూడా బహిర్గంగా అందరికీ చెబుతోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక చాటింగ్ సెక్షన్ లో

 పాల్గొంది. అందులో భాగంగానే తనకి సంబంధించిన చాలా విషయాలను పంచుకుంది. అయితే అందులో భాగంగానే ఆమె ప్రస్తుతం తను సినిమాల నుండి విరామం తీసుకోవడానికి గల కారణం ఏంటి అన్న విషయానికి క్లారిటీ ఇచ్చింది.. ఇంత ఎక్కువ గ్యాప్ తీసుకోవడం... స్క్రీన్‌పై ఎక్కువ కాలం కనిపించకపోవడం అనేది ఎప్పుడూ కావాలని కోరుకున్నది కాదు. సహజంగానే వీలైనంత ఎక్కువ పని చేయాలనుకుంటాం. కానీ మంచి అవకాశాలు కావాలనుకుంటాం. అలాంటి ఒక అవకాశం 2020లో కుదిరింది. నా సినిమా 'తేరా క్యా హోగా

 లవ్లీ' విడుదలై బావున్నా కానీ కోవిడ్ వల్ల నష్టపోయింది. ఆ తర్వాత కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది అంటూ తెలిపింది.. ఆ తర్వాత అందరి డైరెక్టర్ల చూపు మీ నడుము పైనే ఉంటుంది ఎందుకు అని ప్రశ్నించగా..  చాలా మంది దర్శకుల ఫోకస్ ఎందుకనో ప్రధానంగా నా నడుముపైనే ఉంది. వారు నా నడుమును హైలైట్ చేసి చూపించారు.... కానీ ఆ తర్వాత నేను కొందరిని హెచ్చరించాను.. నా శరీరంలో మరో పార్ట్ లేనట్లుగా దర్శకులు అందరూ నడుముపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలా? ఇకపై అది ఆపేయండి అని వార్నింగ్ ఇచ్చినట్టు ఇలియానా తెలిపింది.. అలా ప్రస్తుతం ఇలియానా చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: