ఇటీవల ఆరాధ్యతో కలిసి పలు రకాల ఫోటోషూట్లను కూడా చేయడం జరిగింది. అందుకు సంబంధించిన వాటన్నిటిని కూడా ఆరాధ్య ,వర్మ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా కొన్ని స్పెషల్ ఫోటోషూట్లతో పాటు సాంగ్స్ కి సంబంధించిన వీడియో క్లిప్పులను కూడా వర్మ వైరల్ గా చేశారు. అయితే ఇప్పుడు తాజాగా శారీ సినిమా టీజర్ ని కూడా విడుదల చేశారు. తన ట్విట్టర్ నుంచి అధికారికంగా టీజర్ ని రిలీజ్ చేయగా ఈ టీజర్ చాలా బోల్డ్ గా వైలెంట్ గా కనిపిస్తోంది.
టీజర్ విషయానికి వస్తే రెగ్యులర్గా చీరలోనే తిరిగే ఒక అందమైన అమ్మాయిగా ఆరాధ్య కనిపించింది అయితే ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించే ఒక అబ్బాయి ఆమెకు తెలియకుండా ఆమె వెంట తిరుగుతూనే ఉంటారు.. అయితే ఆ ప్రేమ సైకోగా మారడంతో ఎలా ఉంటుంది అనే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. అయితే ఇందులో ఆరాధ్య అని ఎంత బోల్డ్ గా చూపించారో .. అంతే సైకోగా ఇందులో ఉండే నటుడిని చూపించారు. చీర కట్టులో వివిధ యాంగిల్స్ లో ఆరాధ్యను చాలా గ్లామర్ గా చూపించారు వర్మ. ప్రస్తుతం శారీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందట. మరి ఈ సినిమా విడుదల తేదీని ఇంకా తెలియజేయలేదు ప్రస్తుతమైతే ఈ టీజర్ అదరగొట్టేస్తోంది.