పుష్ప సినిమాలో కలపను స్మగ్లింగ్ చేసే విధంగానే ఈ బంగాళాదుంపలను స్మగ్లింగ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కలపకు బదులు బంగాళాదుంపలను ఉపయోగించారు. పోలీసులు పుష్ప సినిమా లాగానే ఈ స్మగ్లింగ్ చేపట్టినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. మనుషులపై సినిమాల ప్రభావం ఎంతగా ఉంటుందో ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పశ్చిమబెంగాల్లో కూడా పుష్ప మేనియా వేరే రేంజ్ లో ఉందని ఈ ఘటన చెప్పగానే చెబుతోంది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే, పశ్చిమ బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు బంగాళాదుంపలు తరలిస్తున్న ఓ లారీని పోలీసులు చాలా చాకచక్యంగా అడ్డుకున్నారు. ఈ లారీలో బంగాళాదుంపలతో పాటు నకిలీ బిల్లులు కూడా ఉన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ బిప్లాబ్ మొండల్ ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆయనతో ఉన్న వ్యక్తి మాత్రం పారిపోయాడు. అరెస్టైన డ్రైవర్ బిప్లాబ్ మొండల్, తాము మట్టిని తరలించాల్సి ఉందని, కానీ లారీ యజమాని బంగాళాదుంపలు తరలించమని బలవంతం చేశాడని చెప్పాడు. నకిలీ బిల్లుల గురించి తనకు తెలియదని, వాటిని తోటి వ్యక్తి చూసుకుంటున్నాడని చెప్పాడు.
పోలీసుల విచారణలో, బంగాళాదుంపలను పశువుల మేత అంటూ నకిలీ బిల్లులు ఇచ్చి తరలిస్తున్నారని తేలింది. ఈ లారీలను ఇతర రాష్ట్రాలకు రహస్యంగా తరలించాలని సూచనలు ఇచ్చారని తెలుస్తోంది. దుబుర్దిహి చెక్‌పోస్ట్, కుల్టి పోలీస్ స్టేషన్ పోలీసులు శుక్రవారం రాత్రి నుండి ఇప్పటి వరకు బంగాళాదుంపలు తీసుకెళ్తున్న 20కి పైగా లారీలను అడ్డుకున్నారు. ఈ లారీలను అన్నీ పశ్చిమ బెంగాల్‌కే తిరిగి పంపించారు. బంగాళాదుంపలను అక్రమంగా తరలిస్తున్న వారిని అరెస్టు చేయడానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనలో పుష్ప హైలెట్ కావడం విశేషం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి