ఈ సినిమా 175 రోజుల సెంటర్ల వివరాలకు వస్తే 52 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడింది. ఈ సినిమా విడ్దలై దాదాపుగా 22 సంవత్సరాలు అవుతున్నా ఈ సినిమా సాధిస్తున్న రికార్డులు మాత్రం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అప్పట్లో తక్కువ టికెట్ రేట్లతోనే ఫుల్ రన్ లో ఈ సినిమా ఏకంగా 21 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సింగమలై అంటూ ఉండే ఫ్లాష్ బ్యాక్ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.
సింహాద్రి మూవీ కలెక్షన్ల విషయంలో సాధించిన సంచలనాలను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులలో ఎక్కువమందికి సింహాద్రి మూవీ ఫేవరెట్ మూవీ కావడం గమనార్హం. భూమిక, అంకిత ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా వాళ్లిద్దరూ తమ అద్భుతమైన నటనతో మెప్పించి ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నారనే చెప్పాలి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నీ తారక్ ను నటుడిగా మరింత ఎత్తుకు చేర్చి గ్లోబల్ స్థాయిలో తారక్ కు సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్2 సినిమా కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్2 బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి