టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించి ఎన్నో మూవీలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ రెండు సినిమాల్లో ఓ ఇద్దరు బ్యూటీలు నటించారు. ఆ రెండు సినిమాల ద్వారా కూడా తారక్ కి మంచి విజయాలు దక్కాయి. ఆ సినిమాలు ఏవి ..? ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం.

తారక్ కొన్ని సంవత్సరాల క్రితం బృందావనం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు రాజు నిర్మించాడు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , సమంత హీరోయిన్లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తారక్ కొన్ని సంవత్సరాల క్రితం జనతా గ్యారేజ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత , నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇక కాజల్ ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటి వరకు తారక్ నటించిన సినిమాలలో కాజల్ అగర్వాల్ , సమంత ఇద్దరు ఉన్న సినిమాలు రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం తారక్ "వార్ 2" అనే హిందీ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: