తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా అనేక సినిమాలను నిర్మించి అందులో కూడా కొన్ని మూవీలతో అద్భుతమైన సక్సెస్ లను అందుకొని నిర్మాతగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా కళ్యాణ్ రామ్ అర్జున్ S/O వైజయంతి అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ లో అలనాటి స్టార్ నటి విజయశాంతి , కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ కి విడుదల 24 గంటల్లో 9.1 మిలియన్ వ్యూస్ దక్కగా ... 178 కే లైక్స్ లభించాయి.

ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ యొక్క ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. కళ్యాణ్ రామ్ ఆఖరుగా బింబిసారా మూవీ తో మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన అమిగొస్ , డెవిల్ మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్ కి నిరాశనే మిగిల్చాయి. మరి అర్జున్ S/O వైజయంతి సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nkr