
అక్కినేని హీరో నాగచైతన్య రీసెంట్ గా తండెల్ సినిమా తో రూ .100 కోట్ల హీరో గా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు .. ఇక ఈ సినిమా లో రాజు అనే పాత్ర లో ఎంతో రఫ్ లుక్ లో కనిపించి ప్రేక్షకుల ను తన నటన తో సర్ప్రైజ్ చేశాడు .. ఇలా తండేల్ లాంటి హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకు ని ఇప్పుడు తన తర్వాత సినిమా ని మొదలు పెట్టబోతున్నాడు .. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం లో ఓ మిస్టిక్ థ్రిల్లర్ సినిమా లో నాగచైతన్య నటించబోతున్నాడు .. ఇక ఈ సినిమా ను అనౌన్స్ చేసి చాలా రోజులే అయింది .. ఇక ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా హైదరాబాద్ లోప్రారంభమయ్యింది.
ఇప్పటికే కొంత భాగాన్ని కంప్లీట్ చేసుకోగా అయితే ఇప్పుడు తాజా గా ఈ సినిమా షూటింగ్ లో నాగచైతన్య పాల్గొనబోతున్నాడు .. అలాగే ఈ సినిమా కోసం సరికొత్త స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్ లోకి చైతు మారిపోయాడట .. అలాగే ఈ సినిమా చైతు కెరీర్ లోనే 24 వ సినిమా గా రాబోతుంది .. NC 24 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రాబోతుంది .. ఈ సినిమా ను బివిఎస్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు .. ఈ సినిమా కూడా విరూపాక్ష రేంజ్ లో మిస్టీరియస్ హారర్ సినిమా గా తెరకెక్కించబోతున్నాడు కార్తీక్ దండు .. నాగచైతన్య కూడా ఈ సినిమా తో మరో బ్లాక్ బస్టర్ ఖాయమ ని గట్టి నమ్మకం గా ఉన్నాడు .. ఇక మరి ఈ అక్కినేని హీరో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే ..