
అయితే రామ్ చరణ్ కాకుండా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో కొడుకులా భావించే హీరో ఎవరు అని అడిగితే మాత్రం కచ్చితంగా అక్కడ వినిపించే పేరు జూనియర్ ఎన్టీఆర్ . తారక్ ..నందమూరి హీరో . ఎస్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చిరంజీవికి చాలా చాలా ఇష్టం . చాలా అభిమానం ఒకానొక ఇంటర్వ్యూలో ఓపెన్ గానే ఒప్పేసుకున్నాడు చిరంజీవి. జూనియర్ ఎన్టీఆర్ డాన్సింగ్ స్టైల్ తనకు బాగా ఇష్టమని .. ఆయన డాన్స్ చేసే పద్ధతి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని .. ఓ రేంజ్ లో పొగిడేసారు .
అంతేకాదు చరణ్ లాగే ఎన్టీఆర్ ని కూడా తన కొడుకుల భావించి "ఏరా ఎన్టీఆర్" అనే చనువుగా పిలిచే అంత ఇష్టం మెగాస్టార్ కి జూనియర్ ఎన్టీఆర్ అంటే . ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మురిసిపోతున్నారు. అంతేకాదు వీళ్ళ బాండింగ్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. తారక్ మాత్రం పాన్ ఇండియా సినిమాలకి కమిట్ అవుతూ ప్రతి సినిమాను పక్కాగా షెడ్యూల్ గా ముందుగానే ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తారక్ నటించిన వార్ 2 త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతుంది..!