త్వరలోనే సమంత రూత్ ప్రభు పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్లు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో ఇన్ని వార్తలు వినిపించినా కూడా సమంత స్పందించకపోవడం చాలామందికి అంతు పట్టడం లేదు. అయితే కొంతమంది హీరోయిన్లు వాళ్ల మీద రూమర్లు స్ప్రెడ్ అయితే కచ్చితంగా వాటి గురించి స్పందించి అందులో ఎలాంటి నిజం లేదు అని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ సమంత రెండో పెళ్లి వార్తలు గత నాలుగైదు నెలల నుండి ఎక్కువగా వినిపించినా కూడా సమంత వాటిని కొట్టి వేయకపోవడం అందరిలో అనుమానాలకు దారితీస్తోంది. ముఖ్యంగా నిర్మాత రాజ్ నిడిమోరు తో సమంత రెండో పెళ్లి వార్తలు ఖండించకపోవడంతో వీరిద్దరి పెళ్లి వార్తలు నిజమేనని చాలామందికి క్లారిటీ వచ్చింది.అయితే తాజాగా హీరోయిన్ సమంత తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. 

తిరుమలలో శ్రీవారిని సందర్శించుకుని ఆ తర్వాత శ్రీకాళహస్తికి కూడా వెళ్లి కొన్ని పూజలు చేసినట్టు తెలుస్తోంది. అయితే సమంత తన రెండో పెళ్లికి సంబంధించి శ్రీవారిని దర్శించుకుంది అని శ్రీవారి దర్శనంతో పెళ్లి పనులు స్టార్ట్ చేసింది అని  కొంతమంది అంటే, మరి కొంత మందేమో సమంత తన కొత్త సినిమా శుభం హిట్ అవ్వాలి అని ఆ దేవున్ని దర్శించుకుందని అంటున్నారు.అయితే శ్రీవారి దర్శనం కోసం సమంత ఒక్కతే కాకుండా డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా రావడంతో మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ మధ్యకాలంలో సమంత ఎక్కడికి వెళ్లినా రాజ్ నిడిమోరు చేతులు విడిచిపెట్టడం లేదు. ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లడంతో వీరిద్దరి రెండో పెళ్లి వార్తలు నిజమేనని అందరికీ ఓ క్లారిటీ వస్తుంది.

ముఖ్యంగా సమంత లాగే రాజ్ నిడిమోరు కి కూడా పెళ్లయింది.కానీ రాజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి సమంతని రెండో పెళ్లి చేసుకుంటారని మీడియా మొత్తం కోడై కూస్తోంది. అలాగే మే నెలలో సమంత రాజ్ నిడిమోరుల పెళ్లి జరగబోతుందని,ఈ పెళ్లికి అటు సమంత ఫ్యామిలీతో పాటు ఇటు రాజ్ నిడిమోరు ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా సమంత తన రెండో పెళ్లి వార్తలపై స్పందించి అందులో ఎంత నిజం ఉంది అనేది చెబుతుందా.. లేక రహస్యంగా ప్రియుడిని పెళ్లాడి అందరికీ షాక్ ఇస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: