కమల్ హాసన్ త్రిష కాంబినేషన్లో వస్తున్న థగ్ లైఫ్ మూవీకి మణిరత్నం డైరెక్షన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో భారీ తారాగణం కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా ఫస్ట్ ఛాయిస్ కమల్ హాసన్ కాదట వేరే హీరోని మణిరత్నం అనుకున్నారట. హీరోయిన్ గా త్రిషని అనుకున్నప్పటికీ హీరోగా మరో నటుడిని అనుకున్నారట.కానీ ఆ నటుడు చివర్లో హ్యాండ్ ఇచ్చారట. మరి ఇంతకీ మణిరత్నం థగ్ లైఫ్ మూవీకి ముందుగా అనుకున్న ఆ హీరో ఎవరు? ఎందుకు ఆ హీరో ఈ సినిమాలో నటించలేదు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు మణి రత్నం సినిమాలంటే ఎంతో మందికి చెప్పలేనంత ఇష్టం. అయితే ఇప్పుడు మణి రత్నం సినిమాలకి అప్పుడు మణి రత్నం సినిమాలకి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పట్లో మణి రత్నం సినిమాలు వస్తే చూడడానికి ఎంతోమంది జనాలు ఎగబడే వారు. 

కానీ ఇప్పుడు మణి రత్నం డైరెక్షన్ చేసే సినిమాల్లో ఏదో మ్యాజిక్ మిస్ అవుతుంది అని ఆయన అభిమానులు నిరాశ పడుతున్నారు.ఇక మణి రత్నం డైరెక్షన్ చేసిన పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2 రెండు సినిమాలు కూడా ఆశించినంత ఫలితం రాబట్టలేదు. తాజాగా కమల్ హాసన్ తో థగ్ లైఫ్  మూవీతో రాబోతున్నారు. అయితే ఈ సినిమాకి కమల్ కంటే ముందు విక్రమ్ ని హీరో అనుకున్నారట మణిరత్నం. విక్రమ్ తో పిఎస్1,పిఎస్ -2 సినిమాలు చేసే సమయంలోనే థగ్ లైఫ్ మూవీ స్టోరీ చెప్పారట. ఇక ఈ స్టోరీ బాగా నచ్చిన విక్రమ్ చేస్తానని చెప్పారట.అంతేకాదు మణిరత్నం సార్ నెక్స్ట్ మూవీలో నేను త్రిష ఇద్దరం నటిస్తున్నామని కూడా ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ చెప్పారు.

కానీ సడన్గా విక్రమ్ ప్లేస్లోకి కమల్ ఎంట్రీ ఇచ్చాడు.అయితే పిఎస్1 పిఎస్ టు సినిమాలపై మణిరత్నం కంటే ఎక్కువగా విక్రమ్ ఆశలు పెట్టుకున్నారట. కానీ ఈ రెండు సినిమాలు కూడా యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో నిరాశ పడ్డ విక్రమ్ మణిరత్నం నెక్స్ట్ సినిమాని రిజెక్ట్ చేశారట. అయితే పిఎస్ టు సినిమా విడుదలయ్యాక మణిరత్నం విక్రమ్ మధ్య విభేదాలు వచ్చాయని,అందుకే విక్రమ్ థగ్ లైఫ్ మూవీని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. అలా విక్రమ్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాలోకి హీరోగా కమల్ హాసన్ ని తీసుకున్నారు. అలాగే శింబు ప్లేస్ లో మొదట రవి మోహన్ ని అనుకున్నారట.కానీ ఈయన కూడా రిజెక్ట్ చేయడంతో శింబు చేశారు. అలా విక్రమ్ చేయాల్సిన థగ్ లైఫ్ మూవీ చివరికి కమల్ హాసన్ చేతుల్లోకి వచ్చిందట

మరింత సమాచారం తెలుసుకోండి: