టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో విశ్వంభర ఒకటి. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 250 కోట్ల రూపాయలు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. విశ్వంభర మూవీ గ్రాఫిక్స్ ఖర్చు ఏకంగా 75 కోట్ల రూపాయలు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మొత్తం 25 కోట్ల రూపాయలు మాత్రమేననే ప్రచారం కూడా జరుగుతోంది.
 
అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం మేకర్స్ స్పందించే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. విశ్వంభర మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ కావాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై నెలలో ఈ సినిమా విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఒకింత ఆసక్తికర ట్విస్టులతో ఉండబోతుందని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
 
విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. విశ్వంభర బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విశ్వంభర ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
 
మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ ను మించి ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. మల్లిడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా వశిష్టకు రెండో సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఈ దర్శకుడు ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విశ్వంభర ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న విశ్వంభర ఇతర భాషల ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: