కామెడీ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు అంటే తెలియని వారు ఉండరు.ఈయన ఏ సినిమా చేసినా కూడా అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కామెడీ జానర్ లో సంపూర్ణేష్ బాబు చేసే సినిమాలు చూసే ప్రేక్షకులకు నవ్వు రాక మానదు. అయితే అలాంటి సంపూర్ణేష్ బాబు సోదరా అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ సంపూర్ణేష్ బాబు ఏం మాట్లాడారు.. నిజంగానే సంపూర్ణేష్ బాబుకి రెండో భార్య ఉందా..ఈ గూగుల్ అనుష్క ఎవరు.. అనేది ఇప్పుడు చూద్దాం.. సంపూర్ణేష్ బాబు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మిట్టపల్లి లో జన్మించారు.విశ్వకర్మ కుటుంబంలో జన్మించిన సంపూర్ణేష్ బాబు కడు పేదరికంలో ఉండేవారట. 

తినడానికి తిండి కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారట. దాంతో చదువుకోడానికి స్తోమత కూడా లేక పదవ తరగతి వరకు చదివి ఆ తర్వాత చదువు మానేసి అన్నతో బంగారు ఆభరణాలు తయారు చేసే పని నేర్చుకున్నారట.. ఇక చిన్నప్పటినుండి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న సంపూర్ణేష్ బాబుకి శ్రీకాంత్ మహాత్మా మూవీలో ఒక చిన్న రోల్ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత హృదయ కాలేయం అనే కామెడీ మూవీ లో హీరోగా చేశారు. ఈ సినిమా ఓ మోస్తారు విజయం అందుకుంది.ఆ తర్వాత మంచు మనోజ్ కరెంటు తీగ మూవీలో బాలీవుడ్ నటి సన్నీ లియోనికి కాబోయే భర్త పాత్రలో నటించారు. అలాగే కొబ్బరిమట్ట సినిమాలో కూడా నటించారు.

అలా కామెడీ హీరోగా పలు సినిమాలు చేస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశారు. అయితే తాజాగా ఈయన  సోదరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా భార్య ఉమారాణి ఇప్పటికీ మిషన్ కుడుతూనే ఉంటుంది అని చెప్పారు. అయితే ఈ మాటలు విన్న యాంకర్ మీ భార్య పేరు ఉమారాణి అయితే గూగుల్ లో మీ భార్య పేరు సెర్చ్ చేస్తే అనుష్క అని చూపిస్తుంది. మీ భార్య అనుష్కనా..ఉమారాణినా.. అసలు ఇంతకీ ఈ గూగుల్ అనుష్క ఎవరు అంటూ సంపూర్ణేష్ బాబుని ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్న వినగానే సంపూర్ణేష్ బాబు నా భార్య పేరు అనుష్క కాదు..గూగుల్ లో అలా ఎందుకు చూపించిందో నాకు తెలియదు. ఇప్పటివరకు నేను గూగుల్ లో సెర్చ్ కూడా చేయలేదు.నా భార్య పేరు ఉమారాణి మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: