చాలా రోజుల నుండి రామ్ పోతినేని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ని ప్రేమిస్తున్నారని,వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే రామ్ పోతినేని అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ వంటి సినిమాలు కూడా హిట్టు అవ్వడంతో వీరి కాంబోతో పాటు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. దాంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని అప్పటినుండి రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.అయితే రామ్ పోతినేనిప్రేమ వార్తలపై స్పందించి మా ఇద్దరి మధ్యలో ఏమి లేదు అని చెప్పారు.అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా ఇవి వట్టి రూమర్లే అని కొట్టిపారేసింది.కానీ నెటిజన్స్ ఎక్కడో వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది అని పసిగట్టారు.అయితే తాజాగా అనుపమ పరమేశ్వరన్, రామ్ పోతిరనేని ల మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే ప్రేమ కాదు అని రామ్ పోతినేని మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డారనే రూమర్లు వినిపిస్తున్నాయి. 

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే.. రవితేజ హీరోగా చేసిన Mr.బచ్చన్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే నటించింది.ఈ సినిమా ప్లాఫ్ అయినప్పటికీ భాగ్యశ్రీ అందానికి చాలామంది యూత్ ఫిదా అయిపోయారు. అంతేకాదు భాగ్యశ్రీ అచ్చం రష్మిక మందన్నా లాగే ఉంది అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.ఇక ఈ సినిమా హిట్ కాక పోయినప్పటికీ భాగ్యశ్రీ కి వరుస ఆఫర్స్ వచ్చాయి. అలా రామ్ పోతినేని సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా అటు హీరోయిన్ ఇటు హీరో ఇద్దరూ కూడా తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.అయితే ఆ ఫోటోలో బ్యాగ్రౌండ్ చూస్తే వీళ్లిద్దరూ ఒకే రూమ్ లో ఉన్నారని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

 తాజాగా భాగ్యశ్రీ తన సోషల్ మీడియా ఖాతాలో అలాగే రామ్ పోతినేని తన సోషల్ మీడియా ఖాతాలో సెల్ఫీ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.అయితే ఈ ఫొటోస్ చూసిన చాలామంది నెటిజన్లు ఇద్దరు ఒకే హోటల్లో ఒకే రూమ్ లో ఉన్నారని, వీరిద్దరి మధ్య ప్రేమ నిజమేననే రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారు.అయితే ఈ రూమర్లలో ఉన్నది ఎంత నిజమో తెలియదు కానీ వీటిని ఆపడం చాలా కష్టం అంటున్నారు సినీ జనాలు.ఎందుకంటే ఒక హీరో హీరోయిన్ మధ్య రూమర్ వినిపిస్తే చాలు అది ఎక్కడి దాకా అయినా వెళ్తుంది. మరి చూడాలి మరాఠి బ్యూటీతో రామ్ పోతినేని ప్రేమాయణం ఎక్కడి వరకు కొనసాగుతుందో

మరింత సమాచారం తెలుసుకోండి: