కొంతమంది హీరోయిన్లు తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడు చాలామందికి అంత నచ్చవు.ముఖ్యంగా ఆ హీరోయిన్స్ తీసుకున్న నిర్ణయాలకు అభిమానులు కూడా ఛీ కొడుతూ ఉంటారు. అలా ప్రస్తుతం ఓ హీరోయిన్ ని తన అభిమానులు సైతం ఛీ కొడుతున్నారు. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే మృణాల్ ఠాకూర్.. అయితే ఈ పేరు వినగానే చాలామంది నెటిజన్లు ఇంతకీ మృణాల్ ఠాకూర్ ఏం చేసింది..ఆమె అభిమానుల సైతం ఎందుకు ఆమెను ఛీదరించుకుంటున్నారు అనే అనుమానం మీ అందరిలో కలుగుతుంది. అయితే మృణాల్ ఠాకూర్ చేసిన పని ఏంటయ్యా అంటే..ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం వదులుకుందట.కొంతమంది నటీనటులు చేతుల దాకా వచ్చిన అవకాశాలని కాళ్లతో తన్నేసుకుంటారు. అలానే చేసిందట హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా..ఎందుకంటే మృణాల్ కి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. 

అడివి శేష్ డెకాయిట్ మూవీ తప్ప మరో సినిమాలో మృణాల్ ఠాకూర్ పేరు వినిపించడం లేదు. దాంతో ఈ హీరోయిన్ క్రేజ్ సౌత్ లో తగ్గిపోయింది అనే రూమర్ కూడా వినిపిస్తోంది. అలా అని నార్త్ లో కూడా అంత బిజీగా ఏమీ లేదు.అయితే అవకాశాలు లేని సమయంలో చాలామంది నటీనటులు ఎలాంటి పాత్ర వచ్చిన కూడా చేయడానికి రెడీగా ఉంటారు.కానీ ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా స్టార్ హీరో సినిమానే రిజెక్ట్ చేసిందట. ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు తెరమీద వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ గా మృణాల్  ఠాకూర్ ని కూడా సంప్రదించారట మూవీ మేకర్స్.

కానీ ఈ సినిమాలో నటించడం కోసం మృణాల్ మొదట ఒప్పుకోకపోయినప్పటికీ ఆ తర్వాత భారీ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిందట. అయితే టాలీవుడ్ లో అంతగా పేరు లేని ఈ హీరోయిన్ కి అంత రెమ్యూనరేషన్ ఇచ్చే బదులు టాప్ హీరోయిన్ ని తీసుకొని అదే రెమ్యూనరేషన్ ఆ హీరోయిన్ కి ఇస్తే సినిమాకి మరింత బజ్ పెరుగుతుంది కదా అని మేకర్స్ ఆలోచించి మృణాల్ ని పక్కన పెట్టారట. అలా అవకాశాలు లేని సమయంలో వచ్చిందే గొప్ప అననుకొని మృణాల్ ఠాకూర్ ఆ సినిమాని చేస్తానని ఒప్పుకోకుండా చేతుల దాకా వచ్చిన అవకాశాన్ని కాళ్లతో తన్నేసుకుంది అంటున్నారు ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: