టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో మాత్రం పూరి జగన్నాథ్ కి సరైన విజయాలు దక్కడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం పూరీ జగన్నాథ్ , పవన్ కళ్యాణ్ హీరోగా బద్రి అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఓ మాట చెప్పిన కూడా దానిని అస్సలు పూరి జగన్నాథ్ పట్టించుకోలేదట.

అసలు బద్రి సినిమా సమయంలో ఏం జరిగింది ..? అనే వివరాలను తెలుసుకుందాం. పూరీ జగన్నాథ్ ఒక రోజు పవన్ కళ్యాణ్ కు బద్రి సినిమా కథ మొత్తాన్ని వివరించాడట. కథ మొత్తం విన్న పవన్ సినిమా స్టోరీ మొత్తం సూపర్ గా ఉంది. కానీ క్లైమాక్స్ నాకు నచ్చడం లేదు. కొన్ని రోజులు టైమ్ తీసుకుని క్లైమాక్స్ మార్చి వినిపిస్తావా అని అన్నాడట. దానితో పూరి జగన్నాథ్ "బద్రి" సినిమా కోసం అనేక క్లైమాక్స్ లను అనుకున్నాడట. కానీ ఏది కూడా అతనికి అంత బాగా నచ్చలేదట. ఒక రోజు పవన్ కళ్యాణ్ దగ్గర నుండి పూరీ జగన్నాథ్ కి ఫోన్ వచ్చిందట. దానితో పూరి జగన్నాథ్ , పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి మరోసారి మొదట చెప్పిన క్లైమాక్స్ ని వివరించి చెప్పాడట. దానితో పవన్ ముందు కూడా ఇదే చెప్పావు కదా అన్నాడట. దానితో పూరి జగన్నాథ్ నేను ఈ సినిమా కోసం అనేక క్లైమాక్స్ లను అనుకున్నాను.

కానీ ఏది కూడా ఈ కథకు పూర్తిగా సెట్ అవ్వడం లేదు. అందుకే దీనినే ఉంచాను అన్నాడట. దానితో పవన్ కళ్యాణ్ కూడా సూపర్ నువ్వు కనుక క్లైమాక్స్ మార్చుకుంటే నీకు సినిమా అవకాశం ఇచ్చేవాడిని కాదు. నీతో సినిమా చేస్తాను అన్నాడట. పవన్ చెప్పిన క్లైమాక్స్ మార్చుకపోవడంతో పవన్ తో సినిమా చేసే అవకాశం వచ్చినట్లు పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: