
అటువంటి తమన్నాను ఇప్పుడు బూతు పదాలతో ట్రోల్ చూస్తున్నారు జనాలు . దానికి కారణం రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలే . తమన్న బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమించుకుంటున్నారు అని డేటింగ్ లో ఉంటున్నారు అన్న సంగతి అందరికీ తెలుసు . అయితే వీళ్లు రీసెంట్ గా బ్రేకప్ చెప్పుకున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి . తాజాగా తమన్నా మాటలు వింటుంటే అదే నిజమనిపిస్తుంది . తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది . ఈ క్రమంలోనే ఆమె తన లైఫ్ అండ్ కెరియర్ పై మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"సుమారు నాకు 15 సంవత్సరాల వయసులో నేను ముంబైకి వచ్చి ఉంటాను .. నాకు తెలియదు అప్పుడు నేను ఇంత పెద్ద స్టార్ అవుతాను అని.. ఇక్కడ నిలబడతాను అని .. ఇప్పుడు నాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది . మొదటి నుంచి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ గా ఉండగలిగాను.. నాకు ఆ విషయంలో ప్రాబ్లం ఏం లేదు " అంటూ తెగేసి చెప్పింది . అంతేకాదు యాంకర్ మ్యారేజ్ గురించి ప్రశ్నించగా "ఇప్పుడు అసలు నా మైండ్లో ఆ ఆలోచన లేదు.. నాకు దాని గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు . ఆలోచించడం అంతకన్నా ఇష్టం లేదు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో తమన్నా మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. తమన్న - విజయ్ వర్మ బ్రేకప్ చెప్పేసుకున్నారని చెప్పడానికి ఇది బిగ్ ఎగ్జామ్పుల్ అంటున్నారు జనాలు. దీంతో తమన్నాను బూతులు తిడుతున్నారు కొంతమంది ఆకతాయిలు..!