బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ గాని ఓ దుండగుడి చేతిలో కత్తి పోటుకు గురైన సంగతి మనకు తెలిసిందే.ఆ దుండగుడు సైఫ్ అలీఖాన్ ని దారుణంగా పొడిచాడు. కానీ అన్ని కత్తి పోట్లు పొడిచినా కూడా సైఫ్ అలీ ఖాన్ ప్రాణాలతో బయటపడ్డాడు అంటే మామూలు విషయం కాదు.. గత మూడు నాలుగు నెలల నుండి సైఫ్ అలీ ఖాన్ దాడి గురించే బీటౌన్ మొత్తం మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు అంత పెద్ద హీరో పైనే కత్తి దాడి చేశారంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అయోమయంలో కూడా పడిపోయారు. అయితే ఆయన దొంగతనానికి వచ్చారని కొంతమంది అంటే లేదు లేదు సైఫ్ ని ఆ వ్యక్తి పొడవడానికి మరో మతలబ్ ఉంది అంటూ ఇలా ఎన్నో రూమర్లు బీటౌన్ లో వినిపించాయి.ఇదంతా పక్కన పెడితే తాజాగా సైఫ్ అలీఖాన్ గురించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే సైఫ్ అలీఖాన్ ఇండియా వదిలి మరో దేశానికి వెళ్లిపోతున్నారట. మరి ఇంతకీ సైఫ్ అలీఖాన్ ఎక్కడికి వెళ్తున్నారో ఇప్పుడు చూద్దాం.. 

సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు బయట దేశాల్లో పెద్దగా ఇల్లు లేవు. కానీ మొదటిసారి ఖాతర్ లో ఇల్లు కొనుక్కోవాలి అనిపించింది.అందుకే ఖతర్లో ఒక ప్రశాంతమైన వాతావరణం లో ఇల్లు కొనుక్కున్నాను.. అక్కడ చాలా పీస్ ఫుల్ గా ఉంది. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోదామా అని అనుకుంటున్నాను. అది నా హాలిడే హోమ్. నేను ఓ సినిమా షూటింగ్ కోసం ఖాతర్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న లొకేషన్ మొత్తం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అక్కడ ఇల్లు కొనాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను.దాంతో ప్రశాంతమైన వాతావరణంలో మంచి ఇల్లు కొనుక్కున్నాను. అది ఎంతో అందమైన దేశం.. అలాగే సేఫ్టీ కూడా ఆ దేశంలో ఎక్కువగానే ఉంటుంది..

అందుకే నా ఫ్యామిలీ ని కూడా త్వరలోనే ఆ దేశానికి షిఫ్ట్ చేసి నేను కూడా అక్కడికి వెళ్లి పోతాను. అక్కడ ఉంటే నా జీవితం ప్రశాంతంగా ఉంటుందని భావిస్తున్నాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకడంలో ఎలాంటి తప్పు లేదు కదా.. అందుకే నేను ఖతర్ లో మంచి ఇల్లు కొనుక్కున్నాను అంటూ సైఫ్ అలీఖాన్ చెప్పుకొచ్చారు. అయితే సైఫ్  మాట్లాడిన మాటలు బీ టౌన్ లో వైరల్ అవ్వడంతో చాలామంది ఈయన మాటలు విన్న నెటిజన్స్ సైఫ్ అలీ ఖాన్ ప్రాణ భయంతోనే ఇండియా వదిలి వేరే దేశానికి పారిపోతున్నాడు కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఎందుకంటే అక్కడ సేఫ్టీ ఉంటుంది అని స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పారు కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: