గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అనేక విజయాలు అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరీర్ను కొనసాగించడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్మూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని వ్రిద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ గ్లిమ్స్ వీడియోలో చివరన చరణ్ క్రికెట్ ఆడుతూ ఎదురుగా వస్తున్న బంతిని కొట్టడానికి ముందుకు వెళ్లి బ్యాటును కింద కొట్టి ఆ తర్వాత బాలును కొడతాడు.

ఆ షార్ట్ అద్భుతమైన రీతిలో వైరల్ అయింది. దానితో బుచ్చిబాబు తాజాగా సిగ్నేచర్ షాట్ గురించి స్పందిస్తూ ... పెద్ది సినిమా నుండి ఫస్ట్ షార్ట్ పేరుతో విడుదల చేసిన వీడియోలో సిగ్నేచర్ షాట్ కి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. కానీ ఆ సిగ్నేచర్ షాట్ క్రెడిట్ మొత్తం ఫైట్ మాస్టర్ నబాకాంత్ కు చెందాలి అని బుచ్చిబాబు తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: