
హీరోయిన్ విజయశాంతి తాజాగా నటించిన మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మదర్ క్యారెక్టర్ లో విజయశాంతి చేసింది. అయితే చాలా సంవత్సరాల నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి పాలిటిక్స్ లో బిజీ అయిపోయింది.కానీ అనిల్ రావిపూడి బలవంతం చేయడంతో కథ నచ్చి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ విజయశాంతి నటించిన మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. ఈ సినిమాలో తల్లి క్యారెక్టర్ లో విజయశాంతి నటిస్తేనే నేను కూడా ఈ సినిమాలో చేస్తాను అని కళ్యాణ్ రామ్ చెప్పారట. దాంతో విజయశాంతి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. అలా ఈ మూవీలో ఒక పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన విజయశాంతి మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అంతేకాదు ఒకప్పటి విజయశాంతి మళ్ళీ ఈ సినిమాతో చూసాం అంటూ ఎంతో మంది విజయశాంతి అభిమానులు సినిమా చూసి సంబరపడిపోయారు.