టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ ఈమేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీరు చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టారు. అలాగే కెరియర్ను ప్రారంభించిన కొత్త నుండి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలలో హీరోగా నటిస్తూ వచ్చి అనేక విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ కలిగిన మాస్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే వీరిద్దరూ ఇప్పటికీ కూడా ఫుల్ జోష్లో సినిమాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటూ అద్భుతమైన రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే వీరిద్దరూ ఒక విషయంలో సేమ్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? దర్శకులను రిపీట్ చేయడంలో. అసలు విషయం లోకి వెళితే ... చిరంజీవి కొంత కాలం క్రితం బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య అనే సినిమాలో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే చిరంజీవి మరోసారి బాబీ కొల్లిక్కి అవకాశం ఇచ్చినట్లు , వీరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాలకృష్ణ కొంత కాలం క్రితం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి అనే సినిమాలో హీరోగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ దర్శకుడి దర్శకత్వంలో బాలకృష్ణ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు కూడా తమకు ఆల్రెడీ హిట్స్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు తమకి హిట్స్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేయడం లో సేమ్ ఫార్ములా ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: