యంగ్ హీరో గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ యాటిట్యూడ్ కారణంగా అడుగడుగునా అవమానాల పాలవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ అంటూ రోడ్డుమీద పెట్రోల్ పోసుకోవడం, మీడియా ఛానల్లోకి ఇంటర్వ్యూ అని వెళ్లి జర్నలిస్టుని అవమానించడం ఇలా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు.. దాంతో ఒక వర్గం ప్రేక్షకులు విశ్వక్ సేన్ మీద నెగిటివ్ ముద్ర వేసేసారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ కి కారణం విశ్వక్ సేన్ యాటిట్యూడే అంటూ సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఈ తరం హీరోలలో ఎవరికి ఎక్కువగా యాటిట్యూడ్ ఉంది అని యాంకర్ ప్రశ్నించడంతో టక్కున విశ్వక్ సేన్ పేరు చెప్పారు.

అయితే ఈ పేరు చెప్పడానికి కూడా ఓ కారణం ఉంది. లైలా మూవీ రిలీజ్ సమయంలో యాటిట్యూడ్ చూపించి  సినిమాని ఫ్లాప్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో ఒక అపార్థం నెలకొంది. అయితే ఈ విషయంలో సర్ది చెప్పుకోవాల్సిన సమయంలో ప్రెస్ అనేది చాలా బలమైనది. కానీ అలాంటి ప్రెస్ ని అవమానించేలా మాట్లాడారు. అలా ఓసారి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి వారికి సర్ది చెబుతాం అని పిలిచిన సమయంలో కూడా వారిపై నిప్పులు చెరిగారు. దాంతో లైలా వంటి మంచి మూవీ ని ప్రెస్ వాళ్ళు చెడ్డ సినిమాని ఓ ముద్ర వేశారు. అందుకే సినిమా ప్లాప్ అయింది. వాళ్ళు చాలా పవర్ఫుల్ కాబట్టి వారికి గౌరవం ఇచ్చేలా మాట్లాడి ఒకసారి క్షేమాపణలు చెబితే సరిపోలేదని వందసార్లు చెప్పడానికైనా ముందుకు రావాలి.

ఈ విషయాన్ని నేను గ్రహించాను కానీ విశ్వక్ సేన్ యాటిట్యూడ్ చూపించడం వల్లే అలా జరిగింది. అయితే ఈ విషయాన్ని నేను విశ్వక్ సేన్ కి ఫోన్ చేసి మరీ చెప్పి గొడవ అంతా సర్దుకుపోయేలా చేద్దాం అనుకున్నాను. కానీ ఆ టైంలో నేను ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయలేదు.రింగ్ అయినా కూడా ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడలేదు.ఆ తర్వాత నేను కూడా మళ్లీ ఆయన కాల్ చేయలేదు. అంటూ బబ్లూ పృథ్వీరాజ్ విశ్వక్ సేన్ ఆటిట్యూడ్ గురించి ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం బబ్లూ పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్లు ఆయన మాట్లాడింది నిజమే అని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: