టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి వారు 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్లో తర్కెక్కుతున్న డ్రాగన్ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్స్ సన్నివేశాన్ని ఈ సినిమా కోసం తెర‌కెక్కిస్తున్నారు .. ఇది సుదీర్ఘంగా సాగే షెడ్యూల్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందని సమాచారం. ఆ పాటలో ఎన్టీఆర్ తో శృతిహాసన్ స్టెప్పలు వేస్తుందని ఇన్సైడ్ వర్గాల టాక్. ప్రశాంత్ నీల్‌ సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే సలార్ టు సినిమాలో కూడా శృతిహాసన్ కనిపించబోతుంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని ప్రశాంత్ నీల్‌ రిపీట్ చేయబోతున్నాడని టాక్. సాధారణంగా ప్రశాంత్ నీల్‌ సినిమాలలో యాక్షన్ కి తప్ప పాటలకు పెద్దగా స్కోప్ ఉండదు.


అయితే ఈసారి ఎన్టీఆర్ కోసం పాటలకు సినిమాలో చోటు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఇదివరకు లేనని పాటలు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం అందుతుంది. అందులో శృతిహాసన్తో చేసే ఐటమ్ సాంగ్ ఒకటి అని సమాచారం. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించబోతోంది. అయితే రుక్మిణి ది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదని .. ఆమె పాత్ర టిపిక‌ల్ గా ఉండబోతుందని ... అందుకే గ్లామర్ కోసం శృతిహాసన్ ఈ టీంలో చేర్చారని తెలుస్తోంది. టాకీ మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ పాట తెర‌కెక్కిస్తారట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: