న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న నాని సినిమా సినిమాకు క్రేజ్ ను పెంచుకుంటుండగా హిట్3 సెన్సార్ కార్యక్రమాలను చాలా రోజుల క్రితమే పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సెన్సార్ బోర్డ్ హిట్3 సెన్సార్ రిపోర్ట్ లో సూచించిన మార్పులు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.
 
శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా 2 గంటల 37 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో సబ్ టైటిల్స్ తో ఎఫ్ వర్డ్ ను తక్కువగా వినియోగించాలని ఓ పదాన్ని సూచించాలని సెన్సార్ బోర్డ్ సూచించింది. సినిమాలో పోలీస్ యూనిఫామ్ కాలిపోతున్న దృశ్యాలను మార్చాలని కాళ్లు, చేతులు, వేళ్లు కట్ చేసే సీన్స్ లో ఫ్లాష్ తగ్గించాలని సెన్సార్ బోర్డ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.
 
రక్తం చిందే సన్నివేశాలలో రెడ్ కలర్ ను డార్క్ కలర్ గా మార్చాలని సూచించినట్టు సమాచారం అందుతోంది. రెమ్యునరేషన్ల గురించి నాని మాట్లాడుతూ మార్కెట్ ఉంటేనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా తీయని వాళ్లే ఎక్కువగా మాట్లాడతారని నాని పేర్కొన్నారు.
 
స్టార్ డైరెక్టర్ల కోసం కొత్త డైరెక్టర్లను హోల్డ్ లో పెట్టనని నాని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. న్యాచురల్ స్టార్ నాని భవిష్యత్తు సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. నానిని అభిమానించే ఫ్యాన్స్ సైతం పెరుగుతోంది. న్యాచురల్ స్టార్ నాని ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: