
ఒక విధంగా చెప్పాలంటే పూరీకి చివరి అవకాశం బెగ్గర్ అని చెప్పవచ్చు. ఈ సినిమా ఫ్లాపైతే మాత్రం ఇండస్ట్రీకి దూరమవ్వాల్సిందే అని చెప్పవచ్చు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో పూరీ జగన్నాథ్ కు భారీ షాకులు తగులుతాయి. బెగ్గర్ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. పూరీ జగన్నాథ్ సరికొత్త కథాంశాలను ఎంచుకుని ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది.
పూరీ జగన్నాథ్ తర్వాత సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. పూరీ జగన్నాథ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ ను ఎంచుకుంటే మాత్రమే మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. పూరీ జగన్నాథ్ కెరీర్ తొలినాళ్లలో బెస్ట్ సినిమాలను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారనే సంగతి తెలిసిందే.
పూరీ జగన్నాథ్ దాదాపుగా 25 సంవత్సరాల క్రితం కెరీర్ ను మొదలుపెట్టగా అప్పటినుంచి ఇప్పటివరకు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం యంగ్ జనరేషన్ లో ఉన్న డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ వయస్సు పెరుగుతుండగా కథనం, డైలాగ్స్ తో మ్యాజిక్ చేయడం ఈ డైరెక్టర్ కు సాధ్యమవుతుందో చూడాలి. పూరీ జగన్నాథ్ ను టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలను తెరకెక్కించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ భవిష్యత్తు ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నయో చూడాల్సి ఉంది.