సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు రజనీ కాంత్ ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రజినీ కాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సాధించి ఉండడంతో జైలర్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ వైరల్ అవుతుంది. మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి పహద్ ఫాజిల్ "జైలర్ 2" మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు , ఈయన పాత్ర నిడివి చాలా తక్కువ గానే ఉన్నప్పటికీ ఈ మూవీ కథ మొత్తాన్ని మలుపు తిప్పే పాత్రగా ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే కొంత కాలం క్రితం రజిని వెట్టయన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాని వేటగాడు అనే పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో ఫాహద్  ఫాజీల్ నటించాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. మరి రెండవ సారి రజిని , ఫాహద్ కలిసి జైలర్ 2 మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ వీరిద్దరూ కలిసి జైలర్ 2 లో నటిస్తే ఆ సినిమా రిసల్ట్ ఎలా ఉంటుందా అనేది జనాల్లో ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: