
కథ :
హ్యుందాయ్ కార్ల కంపెనీలో పని చేస్తున్న సారంగపాణి (ప్రియదర్శి) బెస్ట్ సేల్స్ మేన్ గా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. మైథిలి (రూప) అదే కంపెనీలో మేనేజర్ గా పని చేస్తుంటారు. సారంగపాణి, రూప ప్రేమలో పడగా బాల్యం నుంచి సారంగపాణికి జాతకాలంటే నమ్మకం ఉంటుంది. అయితే మైథిలి మాత్రం ఆధునిక భావాలు ఉన్న యువతి కాగా ఆమె జాతకాలను అస్సలు నమ్మదు.
సారంగపాణి తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడానికి ముందుగానే మైథిలి తన ప్రేమను చెబుతుంది. ఇద్దరికీ మ్యారేజ్ కూడా ఫిక్స్ అవుతుంది. ఆంతా సాఫీగా సాగుతున్న తరుణంలో పబ్ లో సారంగపాణి జిగేశ్వరానంద ( అవసరాల శ్రీనివాస్ ) ను కలుస్తాదు. జిగేశ్వరానంద సారంగ జాతకం చూసి అతను భవిష్యత్తులో మర్డర్ చేస్తాడని చెబుతారు. మర్డర్ భయంగా సారంగపాణి ఏం చేశాడు? అతని లైఫ్ లో ఎదురైన పరిణామాలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ సినిమాలలో సారంగపాణి జాతకం ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. అష్టాచమ్మా, సమ్మోహనం సినిమాలతో మెప్పించిన ఇంద్రగంటి మోహనకృష్ణ అదే మ్యాజిక్ ను ఈ సినిమాతో రిపీట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. బామ్మ ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయింది. కామెడీ యాంగిల్ లో కథను మలుపు తిప్పడం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.
వివేక్ సాగర్ పాటలు, బీజీఎం ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి. పి.జి.విందా సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ వీకెండ్ కు రిలీజైన సినిమాల్లో ఈ సినిమా పైచేయి సాధించింది.
బలాలు : కామెడీ, ప్రధాన నటీనటుల నటన, ఫస్టాఫ్
బలహీనతలు : సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు
రేటింగ్ : 3.0/5.0