టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శర్వానంద్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో హీరో గా నటించిన అనేక సినిమాలతో మంచి విజయాలను అందుకొని అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగించిన శర్వానంద్ ఈ మధ్య కాలంలో మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో కాస్త వెనుకబడిపోయాడు. ఆఖరుగా శర్వానంద్ "మనమే" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శర్వా తన కెరియర్ లో 38 వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రేపు వెలబడబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శర్వా 38 సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో ఇప్పటికే రెడీ అయినట్లు తెలుస్తోంది. సినిమా ఎలా ఉండబోతుంది అనే విధంగా ఆ వీడియో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శర్వా 38 మూవీ 1960 సంవత్సరంలో తెలంగాణ - మహారాష్ట్ర బార్డర్ లో జరిగే పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా  రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకు వచ్చిన రోజు ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం కూడా శర్వానంద్ చాలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో కొన్ని సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఇలా మనమే సినిమా తర్వాత నెక్స్ట్ మూవీ తో శర్వా ప్రేక్షకుల ముందు ఒక రావడానికి కాస్త టైమ్ తీసుకున్న ప్రస్తుతం మాత్రం వరుస పెట్టి సినిమాలను ఓకే చేస్తూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: