మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ అనౌన్స్మెంట్ వీడియోలో భాగంగా ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు కూడా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి మేకర్స్ ఓ టైటిల్ను అనుకుంటున్నట్లు , దానిని ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసే ఆలోచనలో కూడా ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు అన్ని ఓకే అయితే మరికొన్ని రోజుల్లోనే ఆ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంక్రాంతి అల్లుళ్ళు అనే టైటిల్ను కన్ఫామ్ చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఆఖరుగా అనిల్ రావిపూడి , విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుందు.

ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి , చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమాను కూడా సంక్రాంతి పండక్కు విడుదల చేయనున్నాడు. అలాగే ఈ మూవీ టైటిల్లో కూడా సంక్రాంతి పదం వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనే వార్తలు బయటకు రావడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫార్ములాను చిరు సినిమా విషయంలో కూడా అనిల్ రావిపూడి అప్లై చేసేలా ఉన్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: