టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం క్రితం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు.

ఆ తర్వాత ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను ఆ తేదీన విడుదల చేయడం లేదు అని ప్రకటించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం జూలై నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఓ వైపు విశ్వంబర సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో మూవీ ని మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదు అని , చిరు , అనిల్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో నటించడం లేదు అని తెలుస్తుంది. ఇకపోతే చిరు , అనిల్ కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంక్రాంతి అల్లుళ్ళు అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు కూడా ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: