కొంతమంది సెలబ్రిటీలు చేసిన కామెంట్లు అప్పుడప్పుడు వివాదానికి గురవుతూ ఉంటాయి.అయితే తాజాగా ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఎంఎం కీరవాణి హిందువుల గురించి మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. మరి ఇంతకీ ఎం ఎం కీరవాణి హిందువులని అవమానించేలా ఏం మాట్లాడారు..హిందువులు ఎందుకు ఆయనపై ఫైర్ అవుతున్నారు.. ఇండస్ట్రీ నుండి ఆయన్ని బ్యాన్ చేయాలని ఎందుకు నిప్పులు చెరుగుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. మ్యూజిక్ డైరెక్టర్గా.. సింగర్ గా.. సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుగాంచిన ఎం ఎం కీరవాణి రీసెంట్గా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. పాడుతా తీయగా షోలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా షో మీద, ఎం ఎం కీరవాణి,  సింగర్ సునీతల మీద పలు ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలతో సింగర్స్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

అయితే అటు సింగర్ ప్రవస్తి ఎం ఎం కీరవాణి పై ఆరోపణలు చేసిన సంగతి అటుంచితే తాజాగా ఎం ఎం కీరవాణికి సంబంధించి మరో పాత వీడియో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో కీరవాణి క్రిస్టియన్ మతాన్ని గొప్పగా చెబుతూ ఇతర మతాలను అవమానిస్తూ మాట్లాడారు. ఓ సింగింగ్ షోలో జడ్జిగా పాల్గొన్న ఎం ఎం కీరవాణి తనకి జీసస్ అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకోచ్చారు. ఆ సింగింగ్ షోలో కీరవాణి మాట్లాడుతూ.. నేను జీసస్ ని ఎంతగానో నమ్ముతాను. అయితే క్రిస్టియన్ మతంలో ఇతర మతాల కంటే ఒక అంశం భిన్నంగా ఉంటుంది.అదేంటంటే క్రిస్టియన్ మతంలో ఎవరినైనా సరే క్షమించే గుణం ఉండాలని చెబుతారు.ఇతరులను క్షమించే గుణం ఉండాలని క్రిస్టియన్ వారి మతంలో ఉంటుంది కానీ ఇతర మతాలలో ఇలా ఉండదు అంటూ మాట్లాడారు.

అయితే పవిత్రమైన భారత దేశంలో ఉంటూ ఇలా క్రిస్టియన్ గురించి గొప్పగా చెప్పి హిందూ మతాన్ని అవమానించారంటూ పలువురు హిందువులు ఎం ఎం కీరవాణి మాటలపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తాజాగా పహాల్గంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా ఇండియా మొత్తం పాకిస్తాన్ పై వ్యతిరేకంగా ఉండి హిందువులంటే ఎందుకు అంత చిన్నచూపు అనేలా మాట్లాడుతున్నారు. అయితే ఇలాంటి వేళ హిందువులను అవమానిస్తూ క్రిస్టియన్ మతం గురించి గొప్పగా చెప్పిన కీరవాణి పాత వీడియో వైరల్ అవ్వడంతో ఈ వీడియో చూసిన పలువురు హిందువులు ఆయనపై ఫైర్ అవుతూ వెంటనే సౌత్ ఇండస్ట్రీ నుండి ఎం ఎం కీరవాణిని బ్యాన్ చేయాలని, ఆయన పాటల్ని బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: