- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసార వచ్చి మూడేళ్లు అయిపోయింది. ఆ త‌ర్వాత మ‌నోడికి ఒక్క హిట్ లేదు. అమిగోస్ - డెవిల్ అంచ‌నాలు అందుకోలేదు. రెండు డిఫ‌రెంట్ క‌థ‌లే .. డెవిల్ చూస్తే ఇంత మంచి స్టోరీ ఎందుకు హిట్ అవ్వ‌లేదు అనిపిస్తుంది. ఇక బింబిసార కు సీక్వెల్ తీస్తాన‌ని క‌ళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు. ఆ సినిమా డైరెక్ట‌ర్ మ‌ల్లిడి వశిష్ట్ చిరు విశ్వంభ‌ర సినిమాకు లాక్ అయ్యాడు. దీంతో బింబిసార 2 సినిమా ను రొమాంటిక్ ఫేమ్ అనిల్ పాడూరికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఇంకా ప‌ట్టాలు ఎక్క‌లేదు. ఇక తాజాగా వ‌చ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకంతో కళ్యాణ్ రామ్ ఉన్నాడు. ఈ సినిమా ప్లాప్ దిశ‌గా వెళుతోంది. ఎంత బ్రేక్ ఈవెన్ కు ద‌గ్గ‌ర్లో ఉంద‌ని చెపుతున్నా క‌లెక్ష‌న్లు లేవు.


అస‌లు 50 శాతం రిక‌వ‌రీ అయ్యేందుకే ఈ సినిమా నానా తంటాలు ప‌డుతోంది. పైగా ఈ సినిమా నిర్మాణంలో క‌ళ్యాణ్ కూడా నిర్మాణ భాగ‌స్వామి కావ‌డంతో నష్టాల బరువు కళ్యాణ్ రామ్ మీద పడనుంది. దీంతో బింబిసార 2 మీద ఎక్కువ పెట్టుబడి పెట్ట‌లేని ప‌రిస్థితి. అందుకే ఇప్పుడు బింబిసార 2 ను ప‌క్క‌న పెట్టేసి మ‌రో ప్రాజెక్టు చేయాల‌ని కళ్యాణ్ నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. అందుకే అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ, వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా తీసిన దర్శకుడు గిరిసాయ చెప్పిన కథ తో సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడు.


ఏదేమైనా అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతీ పై క‌ళ్యాణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. విజయశాంతి పాత్ర, షాక్ అనుకున్న క్లైమాక్స్ మిగిలిన బలహీనతలకు కాపాడలేకపోయాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు నిర్మాణ భాగస్వామిగా ఉన్న కళ్యాణ్ రామ్ దాంతో పాటు తన కొత్త సినిమా పనుల్లో బిజీ కానున్నాడు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త, కుటుంబ స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: