
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మూవీ అంటే జనాల్లో ఎంత క్రేజ్‌ఉందో కొత్త గా చెప్పాల్సిన పనిలేదు .. పుష్ప 2 సినిమా తో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుని ఏకంగా 1800 కోట్ల కలెక్షన్లు రాబట్టి దాదాపు బాహుబలి 2 రికార్డు లను తుడిచేశాడు .. స్టార్ దర్శకుడు సుకుమార్ తో కలిసి ఈ సంచలనాని కి తెరలేపాడు .. ఇక దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ తర్వాత సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు .. ఇక వరుస దర్శకులతో కమిట్మెంట్ అయినప్పటికీ మొదట కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో తన తర్వాత సినిమా తో రాబోతున్నాడు అల్లు అర్జున్ . ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా ఇండియా లో ఇప్పటివరకు ఎవరూ చేయని జోనర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుంది .. ఈ సినిమా కు సంబంధించిన పనులు ఎంతో వేగంగా సాగుతున్నాయి ..
అయితే సన్ పిక్చర్స్ పతకం పై కలనిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా లో .. స్టోరీ పరంగా ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నట్టు తెలుస్తుంది .. కాగా అందు లో ఒక పాత్ర కోసం స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తుంది .. అంతేకాకుండా ఇప్పటికి ఆమెతో కథకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని .. ఇటీవల లుక్ టెక్స్ట్ లో కూడా పాల్గొన్న అంటూ తెలుస్తుంది . అలాగే మరోవైపు మిగిలిన రెండు హీరోయిన్ల పాత్రల కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్ , దీపికా పదుకొనే పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది .. ఇక ఇప్పటికే జాన్వీ తో చర్చలు కంప్లీట్ అయ్యాయని .. దీపిక తో సంప్రదింపులు జరుగుతున్నాయ ని తెలుస్తుంది .. త్వరలోనే ఈ వార్త పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ..