టాలీవుడ్ స్టార్ హీరోలకు ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్స్ స్లిమ్ లుక్ లోకి కనిపించడానికి ఇష్టపడుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు ఒకే లుక్ లో కనిపిస్తున్నారు. తాను ప్రతిరోజూ కఠినమైన డైట్ ఫాలో అవుతున్నానని నాగచైతన్య చెప్పుకొచ్చారు.
 
పొట్టలోకి వెళ్లే ప్రతిదీ మరీ లెక్కించి తింటానని ఎంత కార్బోహైడ్రేట్స్, ఎంత ప్రోటీన్ అవసరం అనేది కౌంట్ చేసి తింటానని నాగచైతన్య అన్నారు. బిర్యానీ, ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కు తాను పూర్తిస్థాయిలో దూరమయ్యానని నాగచైతన్య కామెంట్లు చేశారు. గతంలో జంక్ ఫుడ్ కోసం ఇంట్లో దొంగతనం కూడా చేశానని ఇప్పుడు దూరమయ్యానని నాగచైతన్య పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేష్ సైతం పాల ఉత్పత్తులకు పూర్తిస్థాయిలో దూరంగా ఉంటున్నారు.
 
తాను విదేశాలకు వెళ్లిన సమయంలో ఐస్ క్రీమ్ లేదా కేక్ తింటానని మహేష్ బబు చెప్పుకొచ్చారు. ప్రభాస్, ఎన్టీఆర్ సైతం కఠినమైన డైట్ ను ఫాలో అవుతూ తన లుక్స్ ను మార్చుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఅర్ బరువు తగ్గడం గురించి తాజాగా సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. శర్వానంద్ సైతం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ బరువు తగ్గి లుక్ మార్చుకున్నారు.
 
రామ్ చరణ్, నాని సైతం కఠినమైన డైట్స్ ను ఫాలో అవుతూ లుక్స్ ను మార్చుకుంటూ వస్తున్నారు. సినిమా సినిమాకు లుక్స్ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోలు వేరియేషన్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: