
ఓజీ కంటే ముందు రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమా కంటే ఎక్కువగా బిజినెస్ జరుగుతున్నదట. ఇప్పటికే ఓజి చిత్రం 200 కోట్లకు పైగా బిజినెస్ ఒప్పందాలు జరిగినట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా బాలీవుడ్ నటీనటులు సైతం ఇందులో కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ డేట్ అడ్జస్ట్ చేస్తే సినిమా షూటింగ్ అని పూర్తి చేసి త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన డేట్లు కేటాయించడానికి ఇటీవలే నిర్మాతలతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని సినిమా విడుదల తేదీకి సహాయపడతారేమో చూడాలి. అలాగే ఓజి సినిమా ఓటీటి,శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకొని బిజినెస్ భారీగానే జరిగినట్లుగా టాక్ వినిపిస్తున్నది. హరిహర వీరమల్లు సినిమాకి కూడా బిజినెస్ బాగానే జరిగినట్లుగా సమాచారం. ఏపీలో ఒక్కటి 100 కోట్ల వరకు అన్ని ఏరియాలలో అమ్ముడుపోయాయని వినిపిస్తోంది. మొత్తానికి అటు హరిహర వీరమల్లు, ఓజి సినిమా రెండు కూడా బిజినెస్ పరంగా బాగానే ఉన్నాయట మరి కలెక్షన్స్ పరిస్థితి ఏంటో చూడాలి.