ఏంటి సమంత ఇంత జరిగినా కూడా మళ్లీ ఆ హీరోతో డేటింగ్ చేస్తానంటుందా? ఇంతకీ సమంత డేటింగ్ చేస్తానని చెప్పిన ఆ హీరో ఎవరు..ఎందుకు జనాలు ఆమెను సిగ్గు లేదా బుద్ధి లేదా అని తిడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ గా ఒక గుర్తింపు తెచ్చుకున్న సమంత ఆ తర్వాత పీక్ స్టేజ్ కి వెళ్ళాక నాగచైతన్యను పెళ్లి చేసుకొని చాలా రోజులు సంతోషంగా జీవితాన్ని గడిపింది.ఆ తర్వాత మయాసైటిస్ అనే మహమ్మారి సోకడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని రీసెంట్ గానే ఓ పోస్ట్ కి లైక్ చేయడం ద్వారా అర్థం అవుతుంది.ఇక విడాకులు అయ్యాక ఎవరిదారి వాళ్ళు చూసుకొని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే సమంత కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే కొంతమంది సెలబ్రిటీలు పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న వీడియోలు మళ్లీ చక్కర్లు కొడుతూ ఉంటాయి. 

అలా ఇప్పటికే సమంత నాగచైతన్యలకు సంబంధించి ఎన్నో పాత వీడియోలు వైరల్ అయ్యాయి.అలా సమంతకు సంబంధించి గతంలో మాట్లాడిన ఓ పాత వీడియో మళ్ళీ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ మళ్ళీ సమంత పై నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.సమంత, కాజల్ అగర్వాల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన బృందావనం సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో సమంత యాక్టింగ్ కి చాలామంది ఫిదా అయ్యారు.ఆ తర్వాత వరుస ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా  సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో యాంకర్ నుండి ఆమెకి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్ లో ఉన్న మహేష్ బాబు, నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు హీరోలలో మీకు అవకాశం వస్తే ఎవరితో డేటింగ్ చేస్తారు అని అడిగారు.

అయితే ఈ ప్రశ్నకు సమంత కొంచెం కూడా ఆలోచించకుండా అక్కినేని నాగచైతన్య పేరు చెప్పింది.దాంతో అందరూ షాక్ అయిపోయారు. అయితే అప్పటికే నాగచైతన్యతో సమంత డేటింగ్ లో ఉంది. అందుకే నాగచైతన్యతో డేటింగ్ చేస్తాను అని సిగ్గుపడుతూ చెప్పిందట.అయితే అప్పటికి కొంత మందిలో నాగచైతన్య సమంత మధ్య ఏదో సంథింగ్ జరుగుతుంది అనే అనుమానం ఉంది. ఇక సమంత మాటలతో ఆ అనుమానం కాస్త నిజమైందట.అయితే అప్పటి పాత వీడియో మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో ఇది ఇప్పటి వీడియోనే కావచ్చు అని కొంతమంది జనాలు ఇంత జరిగినా నీకు సిగ్గు రాలేదా.. మళ్ళి నాగచైతన్యతో డేటింగ్ చేస్తానంటావా అని ఫైర్ అవుతున్నారు.కానీ ఈ వీడియో మాత్రం ఇప్పటిది కాదు అని మరికొంతమంది క్లారిటీ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: